
ట్యాంక్ బండ్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం సెక్రటేరియెట్వద్ద కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. అక్కడి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జై కాంగ్రెస్ జై రాజీవ్ గాంధీ జై రేవంత్ రెడ్డి నినాదాలు చేశారు. ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.